నేటి నుండి జిల్లాలో ప్రారంభం కానున్న ఇసుక ర్యాంపులు
నేటి నుండి జిల్లాలో ప్రారంభం కానున్న ఇసుక ర్యాంపులు
లాక్‌డౌన్ కారణంగా మూతపడిన ఇసుక ర్యాంపులు తిరిగి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం నదిలో నుంచి ఇసుక తీసుకువచ్చి నిల్వ చేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా ఇసుక అధికారి(డీఎస్‌వో) బి.రవికుమార్ తెలిపారు. మంగళవారం నుంచి వెబ్‌సైట్ పునఃప్రారంభించి ఇసుకను వినియోగదారులకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం పిల్లంక, గోవలంక, మురమళ్ల, ఎదుర్లంక, కపిలేశ్వరపురం, కోరుమిల్లి, కోటిలింగాలపేట-3 ర్యాంపులు పనిచేస్తాయని తెలిపారు.
Comments
Post a Comment