ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రావద్దు
ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రావద్దు
లాక్ డౌన్ కారణంగా ఏ విధమైన వాహనాలు బయటకు రాకూడదని, ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రావద్దని రాజమండ్రి పోలీస్ అర్బన్ జిల్లా ఉత్తర మండల డీఎస్పీ పీ. సత్య నారాయణ రావు సూచించారు. కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద బుధవారం ఆయన తనిఖీలు నిర్వహించారు. అత్యవసర సర్వీసులు అందించే వారికి, ప్రభుత్వ విధులు నిర్వర్తించే వారికి ప్రయాణానికి అనుమతి ఉందన్నారు. వాహనదారులు, ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. లాక్ డౌన్, 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ ప్రయాణం చేస్తున్న వారిని నిలుపు చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

Comments
Post a Comment