24 గంటల్లో 128 మంది ప్రాణాలు కోల్పోయారు.
24 గంటల్లో 128 మంది ప్రాణాలు కోల్పోయారు
భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో శనివారం ఒక్కరోజే దేశంలో 3277 కేసులు నమోదయ్యాయి. వైరస్ తో గడిచిన 24 గంటల్లో 128 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా మృతుల సంఖ్య 2109కి చేరగా మొత్తం బాధితుల సంఖ్య 62,939గా నమోదైంది. కరోనా వైరస్ ప్రభావానికి గురైనా వారు ఇప్పటివరకు 19,358మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇది ఇలా ఉండగా 41,472 మంది చికిత్స పొందుతున్నారు.
Comments
Post a Comment