పరిశ్రమ నుంచి 3 కి.మీ మేర వాయువు వ్యాపించింది

పరిశ్రమ నుంచి 3 కి.మీ మేర వాయువు వ్యాపించింది

   విశాఖనగరంలోని ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలో ఎల్‌జీ పరిశ్రమ నుంచి లీకైన రసాయన వాయువు  ప్రమాదకరమైనదని విశాఖ కేజీహెచ్‌ వైద్యులు తెలిపారు. గ్యాస్‌ పీల్చిన వెంటనే మెదడుపై ప్రభావం చూపి అపస్మారక స్థితికి చేరుకుంటున్నారు. మరికొందరు ఊపిరాడక విలవిల్లాడుతున్నారు. బాధితులకు మెరుగైన వైద్య అందించి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్‌.ఆర్‌.వెంకటాపురంతో పాటు, విశాఖ 66వ వార్డుపై విషవాయువు ప్రభావం ఎక్కువగా ఉంది. తెల్లవారుజామున 3గంటల సమయంలో గ్యాస్‌ లీక్‌ అవడంతో ఆసమయంలో అందరూ నిద్రమత్తులో ఉన్నారు. పరిశ్రమ నుంచి 3 కి.మీ మేర వాయువు వ్యాపించింది.ఇప్పటి వరకు 8మంది మృతి చెందినట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

తూర్పుగోదావరి జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు

నేటి నుండి జిల్లాలో ప్రారంభం కానున్న ఇసుక ర్యాంపులు

తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు