పలివెల గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు
పలివెల గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు
కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన 74 ఏళ్ల వృద్ధురాలిలో కరోనా లక్షణాలు వెలుగుచూశాయి. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46కి చేరింది. కాశీ యాత్రకు వెళ్లిన ఈమె ఈనెల 4వ తేదీన జిల్లాకు చేరుకున్నారు. ముందస్తు చర్యగా ఆమెను బొమ్మూరులోని క్వారంటైన్‌కు తరలించిన అధికారులు పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ అని తేలడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖలోని విమ్స్‌కు తరలించారు.
Comments
Post a Comment