బాధ్యతలు స్వీకరించిన అమలాపురం ఆర్డీఓ
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjI6nuwkZzwdgM9aOdmdkxrQqIC_1zSVF_FdNS60CuXZPMhxwD65IT4bVI66QW6OuSyb6QObNw65ksrqk-J9IkGnVt69boMBtO17ah4nVZwV3EYab97zQQeDQy2jIxi_iVGDe8FKSxSh2A/s1600/1594914677551649-0.png)
బాధ్యతలు స్వీకరించిన అమలాపురం ఆర్డీఓ EAST GODAVARI NEWS అమలాపురం ఆర్డీఓ గా పనిచేసిన బి.హెచ్ భవాని శంకర్ బదిలీపై నూజివీడు వెళ్లారు. దీనితో అమలాపురం ఆర్డీఓ స్థానాన్ని ఇంఛార్జి ఆర్డీవో గా ఎస్.ఎస్.వి.బి వసంతరాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయన అల్లవరం మండలం బొదస్కుర్రు లో కరోనా పాజిటివ్ రోగుల కోసం ఏర్పాటు చేస్తున్న కోవిడ్ కెరే సెంటర్ సందర్శించి సిసిసి సెంటర్ ను అందుబాటులోకి తీసుకు రావాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రెండు రోజుల్లో 500 పడకలను అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులకు ఆదేశించారు.