East Godavari News

ఫార్మా కంపెనీలో పేలుడు





         పరిశ్రమలకు కేరాఫ్ అయిన విశాఖను వరస ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఎల్జీ పాలిమర్స్, క్రేన్ కుప్పకూలిన ఘటన మరవక ముందే తాజాగా మరో ప్రమాదం జరిగింది విశాఖ అచ్యుతాపురం సెజ్లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మంటలు ఎగసిపడ్డాయి. దీంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ పడ్డారు పేలుడు దాటికి వచ్చిన మంటల్లో రెండు టూవీలర్లు కాలిబూడిదయ్యాయి ప్రమాద స్థలానికి దగ్గర్లోనే ఫైర్ ఇంజిన్ ఉండటంతో ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి ఆపరేషన్ చేపట్టారు. దాంతో పెనుప్రమాదం తప్పింది. సకాలంలో మంటల్ని ఆర్పిన అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు. ఫైర్ సిబ్బంది సత్వరమే స్పందించకపోతే ఇది మరో భారీ ప్రమాదంగా
మారేదని ఆనేక మందిలో ఆందోళన వ్యక్తమైంది. విషాఖలో వరస ప్రమాదాలు జరుగుతుండడంపై స్థానికుల్లో భయం వ్యక్తమవుతోంది.

Comments

Popular posts from this blog

తూర్పుగోదావరి జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు

నేటి నుండి జిల్లాలో ప్రారంభం కానున్న ఇసుక ర్యాంపులు

తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు