తూర్పుగోదావరి జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు తూర్పుగోదావరి జిల్లాలో రోజురోజుకు కరోనా వైరస్ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా సోమవారం అమలాపురం మండలం బండారులంకలో లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ అయింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ లారీ డ్రైవర్ భార్యకు వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీనితో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అమలాపురం అర్ డీ ఓ లాక్ డౌన్ మరింత కటినంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
నేటి నుండి జిల్లాలో ప్రారంభం కానున్న ఇసుక ర్యాంపులు లాక్డౌన్ కారణంగా మూతపడిన ఇసుక ర్యాంపులు తిరిగి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం నదిలో నుంచి ఇసుక తీసుకువచ్చి నిల్వ చేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా ఇసుక అధికారి(డీఎస్వో) బి.రవికుమార్ తెలిపారు. మంగళవారం నుంచి వెబ్సైట్ పునఃప్రారంభించి ఇసుకను వినియోగదారులకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం పిల్లంక, గోవలంక, మురమళ్ల, ఎదుర్లంక, కపిలేశ్వరపురం, కోరుమిల్లి, కోటిలింగాలపేట-3 ర్యాంపులు పనిచేస్తాయని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు ✓ తుని పట్టణంలోని ముగ్గురు కరోనా బాధితులను చికిత్స అనంతరం సోమవారం డిశ్చార్జి అయ్యారు ✓ జిల్లాకు పొంచివున్న తుపాన్ గండం. కాకినాడ పోర్టులో రెండో ప్రమాద హచ్చరిక. ✓ గొల్లప్రోలు మండలం, మల్లవరం పంచాయితీ పరిధిలోని చెరువులో పడి కార్మికుడు మృతి. ✓ జిల్లా మే 31 లాక్ డౌన్-4 కారణంగా వరకు ఆలయాలు మూసివేత. ✓ అమలాపురం మండలం బండారులంక పరిధిలో ఇప్పటి వరకూ 424 కరోనా పరీక్షలు నిర్వహించారు. ✓ జిల్లాలోని 20 ఇసుక ర్యాంపుల్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
Comments
Post a Comment