Posts

Showing posts from April, 2020

నల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ

Image
నల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ అమలాపురం కొంకాపల్లి హరిమనో వికాస కేంద్రంలోని దివ్యాంగులకు బుధవారం నల్లా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ కు మందు లేదని, భౌతిక దూరం పాటిస్తూనే జాగ్రత్త వహించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోకరకొండ గంగన్నస్వామి, పెద్దిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రావద్దు

Image
ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రావద్దు లాక్ డౌన్ కారణంగా ఏ విధమైన వాహనాలు బయటకు రాకూడదని, ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రావద్దని రాజమండ్రి పోలీస్ అర్బన్ జిల్లా ఉత్తర మండల డీఎస్పీ పీ. సత్య నారాయణ రావు సూచించారు. కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద బుధవారం ఆయన తనిఖీలు నిర్వహించారు. అత్యవసర సర్వీసులు అందించే వారికి, ప్రభుత్వ విధులు నిర్వర్తించే వారికి ప్రయాణానికి అనుమతి ఉందన్నారు. వాహనదారులు, ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. లాక్ డౌన్, 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ ప్రయాణం చేస్తున్న వారిని నిలుపు చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.