Posts

Showing posts from August, 2020

రామరక్షా స్తోత్ర పారాయణ నిర్వహణ

Image
రామరక్షా స్తోత్ర పారాయణ నిర్వహణ అన్నవరం: ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో బుధవారం శ్రీరాముని ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగనున్న సందర్భంగా స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రామరక్షా స్తోత్ర పారాయణ నిర్వహిస్తున్నట్లు పారాయణ బృందం కన్వీనర్ యడవిల్లి ప్రసాద్ తెలిపారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు భక్తులు ముఖాలకు మాస్క్ లను ధరించి, ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని  కోరారు.

మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్

Image
మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్      బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాల్ ను రామచంద్రపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్  వీ. నాగేశ్వర రావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. మొక్కను బహూకరించి మంత్రికి అభినందనలు తెలియజేశారు. ఈ  కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు గుబ్బల యేసురాజు, కుక్కల శ్రీను పాల్గొన్నారు.

కంప్యూటర్ ను అందజేసిన జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ

Image
కంప్యూటర్ ను అందజేసిన జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ   సీతానగరం : సీతానగరంలోని లంకూరు పాఠశాలకు జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ కంప్యూటర్ ను మంగళవారం అందజేసింది. ఈ సందర్భంగా ఎంఇఒ కె.స్వామినాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్ఎం పొలినాటి ఈశ్వరుడు మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను మెరుగు పర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం పి.సుశీల ఎం.వసంతరావు, ఎం.పాపారావు తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి గాయాల పాలయ్యాడు

Image
విద్యుదాఘాతంతో వ్యక్తి గాయాల పాలయ్యాడు        రౌతులపూడి  మండలంలోని బలరామపురంలో భవన నిర్మాణ కార్మికుడు మంగళవారం విద్యుదాఘాతంతో గాయాల పాలయ్యాడు. మల్లవరంలో కార్మికుడు పైల శ్రీను సెంట్రింగ్ రేకులు తొలగిస్తుండగా చేతిలో ఉన్న ఇనుప రాడ్ పక్కనే ఉన్న విద్యుత్ వైరుకు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

స్లాబ్ పద్దతి ద్వారా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహణ

Image
స్లాబ్ పద్దతి ద్వారా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహణ         కడియం జిల్లా పరిషత్ హై స్కూల్ లో మంగళవారం 150 మందికి స్లాబ్ పద్దతి ద్వారా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. డాక్టర్లు సుదర్శనరావు, హిమబిందుల ఆధ్వర్యంలో మండలానికి చెందిన అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది, గర్భిణులు, పలు గ్రామాలకు చెందిన ప్రజలకు పరీక్షలు నిర్వహించారు. అలాగే సీహెచ్ ఓ డాక్టర్ గజేంద్రుడు.పీహెచ్ సీ వైద్యాధికారిణి డాక్టర్ శ్రీవల్లి, ప్రసాదరావు , మూర్తి , విల్సన్ లు పాల్గొన్నారు.

ఇంటింటా శానిటేషన్ పనులు

Image
ఇంటింటా  శానిటేషన్ పనులు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం పాలగుమ్మి గ్రామంలో  కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటింటా బ్లీచింగ్  బెల్ట్ తో పాటు హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ పూర్తిస్థాయిలో  శానిటేషన్ పనులు చేయిస్తున్నరు. ఈ సందర్భంగా  పంచాయతీ కార్యదర్శి బొట్టా నాగేశ్వరరావు మాట్లాడుతూ ... ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసర  పరిస్థితులలో తప్ప బయటకు రావద్దని తెలియజేశారు. వర్గా కాలంలో కరోనా వైరస్ తోనే కాకుండా మనం  ఎదుర్కోవాల్సిన సీజనల్ జ్వరాలు కూడా ఇబ్బంది కలిగిస్తాయని , ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.

కోవిడ్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని డిమాండ్

Image
కోవిడ్ ఇన్సూరెన్స్  వర్తింపజేయాలని డిమాండ్      కరోనా సమయంలో మున్సిపల్ పంచాయతీ కార్మికులు ఎంతో  కష్టపడి పని చేస్తున్నారని, వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్  చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్  వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ   నాయకులు శేషు బాబ్జీ మాట్లాడుతూ... కోవిడ్ ఇన్సూరెన్స్ పారిశుద్ధ్య కార్మికులు అందరికీ వర్తింపజేయాలని డిమాండ్  చేశారు