Posts

Showing posts from May, 2020

తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు

Image
తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు ✓  తుని పట్టణంలోని  ముగ్గురు కరోనా బాధితులను చికిత్స అనంతరం సోమవారం డిశ్చార్జి అయ్యారు   ✓  జిల్లాకు పొంచివున్న తుపాన్ గండం. కాకినాడ పోర్టులో రెండో ప్రమాద హచ్చరిక. ✓ గొల్లప్రోలు మండలం, మల్లవరం పంచాయితీ పరిధిలోని చెరువులో పడి కార్మికుడు మృతి. ✓ జిల్లా మే 31  లాక్ డౌన్-4 కారణంగా  వరకు ఆలయాలు మూసివేత. ✓ అమలాపురం మండలం బండారులంక పరిధిలో ఇప్పటి వరకూ 424 కరోనా పరీక్షలు నిర్వహించారు. ✓ జిల్లాలోని 20 ఇసుక ర్యాంపుల్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు

Image
తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు ✓  జిల్లాలో ప్రజా రవాణా కోసం ఆర్టీసీ ఏర్పాట్లు కరోనా కారణంగా జిల్లాలో ఆర్టీసీకి 50 కోట్ల నష్టం ✓ రైతులు పండించే ధాన్యం నీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా నూరు శాతం కొనుగోలు చేస్తాం : జిల్లా జెసి లక్ష్మీషా. ✓ రూ. 500 కోట్లతో అమలాపురంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఎర్పాటు మంత్రి విశ్వరూప్. ✓ పిఠాపురం పట్టణాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించారు జిల్లా కలెక్టర్ డీ.మురళీధర్ రెడ్డి. ✓ అమలాపురంలో తొలిసారిగా ఇంటర్మీడియట్ పరక్షల మూల్యాంకన కేంద్రం ఏర్పాటు. ✓ బండారులంక పి హెచ్ సి లో శనివారం 76 మందికి కరోనా పరీక్షలు నిర్వహించరు.

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Image
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల వచ్చేసింది. జులై 10 నుంచి పరీక్షలను నిర్వహించనున్నట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది.  ✓  జులై 10న ఫస్ట్‌ లాంగ్వేజ్‌   ✓ 11న సెకండ్‌ లాంగ్వేజ్‌  ✓ 12న థర్జ్‌ లాంగ్వేజ్‌  ✓ 13న గణితం  ✓ 14న సామాన్య శాస్త్రం  ✓ 15న సాంఘిక శాస్త్రం గతంలో నిర్వహించిన మొత్తం 11 పేపర్లను ఈసారి 6 పేపర్లకు కుదించినట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది.  

తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు

Image
తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు కోనసీమలో వరుస కేసులతో జిల్లాలో భారీగా కొవిడ్ పరీక్షలు నిర్వహణ. బుధవారం ఒక్కరోజే 1200 శాంపిల్స్ సేకరణ జిల్లాలో 1130 రైతుబరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా సంయుక్త సంచాలకుడు ప్రసాద్ తెిపారు. నేడు గొల్లప్రోలు పరిధిలో మరమత్తులు కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయం. నేడు గొల్లప్రోలు పరిధిలో మరమత్తులు కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయం. కొత్తపేటలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో రెడ్ జోన్ గా ప్రకటించారు. ఆలమూరు మండలం బడుగువానిలంకలో గోదావరి పడి యువకుడు గల్లంతు.  రావులపాలెం మండలం ఈతకోట జాతీయ రహదారి పై అగ్ని ప్రమాదం టైరు పంచ్ షాప్, పాన్ షాప్ దాగ్ధం. మామిడికుదురు మండలం లో అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు తక్టర్లు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు తహశీల్దార్. కొత్త వేట, బండారులంకలో కొవిడ్ పాజిటివ్ కేసులు రావడంతో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నామని రావులపాలెం సీఐ వి.కృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత దుకాణాలు తెరిచినా, ప్రజలు అనవసరంగా రహదారులపై తిరిగినా చర్యలు తప్పవన్నారు. ఉదయం 6 నుంచి 10 ...

తూర్పుగోదావరి జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు

Image
తూర్పుగోదావరి జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు      తూర్పుగోదావరి జిల్లాలో రోజురోజుకు  కరోనా వైరస్ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా సోమవారం అమలాపురం మండలం బండారులంకలో లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ అయింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ లారీ డ్రైవర్ భార్యకు వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీనితో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అమలాపురం అర్ డీ ఓ లాక్ డౌన్ మరింత కటినంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

నేటి నుండి జిల్లాలో ప్రారంభం కానున్న ఇసుక ర్యాంపులు

Image
నేటి నుండి జిల్లాలో ప్రారంభం కానున్న ఇసుక ర్యాంపులు       లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన ఇసుక ర్యాంపులు తిరిగి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం నదిలో నుంచి ఇసుక తీసుకువచ్చి నిల్వ చేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా ఇసుక అధికారి(డీఎస్‌వో) బి.రవికుమార్‌ తెలిపారు. మంగళవారం నుంచి వెబ్‌సైట్‌ పునఃప్రారంభించి ఇసుకను వినియోగదారులకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం పిల్లంక, గోవలంక, మురమళ్ల, ఎదుర్లంక, కపిలేశ్వరపురం, కోరుమిల్లి, కోటిలింగాలపేట-3 ర్యాంపులు పనిచేస్తాయని తెలిపారు. 

24 గంటల్లో 128 మంది ప్రాణాలు కోల్పోయారు.

Image
24 గంటల్లో  128 మంది ప్రాణాలు కోల్పోయారు        భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో శనివారం ఒక్కరోజే దేశంలో 3277 కేసులు నమోదయ్యాయి.  వైరస్ తో గడిచిన 24 గంటల్లో  128 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా మృతుల సంఖ్య 2109కి చేరగా మొత్తం బాధితుల సంఖ్య 62,939గా నమోదైంది. కరోనా వైరస్ ప్రభావానికి గురైనా వారు ఇప్పటివరకు 19,358మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇది ఇలా ఉండగా 41,472 మంది చికిత్స పొందుతున్నారు.  

Savomi company has released the smartphone MI 10 5G on Friday

Image
Savomi  company has released the smartphone MI 10 5G on Friday The Savomi  company has released the smartphone MI 10 5G on Friday. The phone, which is supposed to have a 108-megapixel camera, has been postponed due to Corona and was finally released on Friday, May 8th.  Specifics :  1. In terms of MI 10 specifications, the 6.67-inch 3D curved AMOLED full HD + display. 2.  Screen 90 Hedge Refresher 3. Snapdragon 856 processor 4. 4,780 mAh battery 5. The phone also supports wireless and wireless charging. 6. There is also reverse charging support .

సచివాలయాలవద్ద రైతుభరోసా జాబితాలు

Image
సచివాలయాలవద్ద రైతుభరోసా జాబితాలు       రైతుభరోసా ఆన్లైన్  పెండింగ్లో రైతులెవరైనా ఉంటే రైతు పట్టాదారు పాస్ బుక్, ఆధార్కార్డు, బ్యాంక్ ఖాతా కాపీలను గ్రామ వ్యవసాయాధికారికి సచివాలయంలో అందజేయాలన్నారు.కే.గంగవరం మండలంలోని 26 గ్రామాల్లో సచివాలయాలవద్ద రైతుభరోసా 2020 మే నెలకు సంబంధించిన జాబితాలు, రైతుల పేర్లు ప్రకటించామని వ్యవసాయాధికారి ఎన్.సత్యప్రసాద్ పేర్కొన్నారు. అలాగే రైతు భాతా పుస్తకానికి ఆధార్ నెంబర్ లింకు చేసుకోవాలని తెలిపారు.

పరిశ్రమ నుంచి 3 కి.మీ మేర వాయువు వ్యాపించింది

Image
పరిశ్రమ నుంచి 3 కి.మీ మేర వాయువు వ్యాపించింది    విశాఖనగరంలోని ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలో ఎల్‌జీ పరిశ్రమ నుంచి లీకైన రసాయన వాయువు  ప్రమాదకరమైనదని విశాఖ కేజీహెచ్‌ వైద్యులు తెలిపారు. గ్యాస్‌ పీల్చిన వెంటనే మెదడుపై ప్రభావం చూపి అపస్మారక స్థితికి చేరుకుంటున్నారు. మరికొందరు ఊపిరాడక విలవిల్లాడుతున్నారు. బాధితులకు మెరుగైన వైద్య అందించి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్‌.ఆర్‌.వెంకటాపురంతో పాటు, విశాఖ 66వ వార్డుపై విషవాయువు ప్రభావం ఎక్కువగా ఉంది. తెల్లవారుజామున 3గంటల సమయంలో గ్యాస్‌ లీక్‌ అవడంతో ఆసమయంలో అందరూ నిద్రమత్తులో ఉన్నారు. పరిశ్రమ నుంచి 3 కి.మీ మేర వాయువు వ్యాపించింది.ఇప్పటి వరకు 8మంది మృతి చెందినట్లు సమాచారం.

బ్యారేజీ వద్ద గోదావరిలో పడి వ్యక్తి మృతి

Image
బ్యారేజీ వద్ద గోదావరిలో పడి వ్యక్తి మృతి     ఆలమూరు మండలం బడుగువాని లంకకు చెందిన డి.చలమయ్య(40) బుధవారం ధవళేశ్వరం  బ్యారేజీ వద్ద గోదావరిలో పడి వ్యక్తి మృతి చెందాడు. గమనించిన స్థానికులు విఆర్ఒకు తెలియజేశారు.విఆర్ఒ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని కొత్త పేట ప్రభుత్వాసువత్రికి తరలించారు. 

పలివెల గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు

Image
పలివెల గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు                  కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన 74 ఏళ్ల వృద్ధురాలిలో కరోనా లక్షణాలు వెలుగుచూశాయి. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 46కి చేరింది.  కాశీ యాత్రకు వెళ్లిన ఈమె ఈనెల 4వ తేదీన జిల్లాకు చేరుకున్నారు. ముందస్తు చర్యగా ఆమెను బొమ్మూరులోని క్వారంటైన్‌కు తరలించిన అధికారులు పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ అని తేలడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖలోని విమ్స్‌కు తరలించారు.   

మద్యం అమ్మకాలుకు తాత్కాలికంగా బ్రేక్

Image
మద్యం అమ్మకాలుకు తాత్కాలికంగా బ్రేక్ మంగళవారం రాజోలు ఎక్సైజ్ శాఖ పరిధిలోని మద్యం అమ్మకాలుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం మద్య ం దుకాణాల వద్ద అమ్మకాలు నిలిపి వేసామని రాజోలు ఎక్సైజ్ సిఐ బలరామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల నుండి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ షాపులు తెరవద్దని ఆదేశాలు వచ్చాయని ఆయన తెలిపారు.

పంటకాలంలో పడి వ్యక్తి మృతి

Image
పంటకాలంలో పడి వ్యక్తి  మృతి తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం గ్రామానికి చెందిన వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు ఆదివారం పంటకాలంలో పడి మృతి చెందినట్లు పి గన్నవరం ఎస్ ఐ జి హరీష్ కుమార్ తెలిపారు. మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ జి. హరీష్ కుమార్ తెలిపారు.

SSB జవాన్లకు కరోనా

Image
SSB జవాన్లకు కరోనా      దిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా మరో ఎనిమిది మంది సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) జవాన్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరంతా దిల్లీలోని పలు ప్రభుత్వ సంస్థల వద్ద భద్రతాసంబంధమైన విధుల్లో ఉన్నారు. ఈ ఎనిమిది కేసులతో కలిపి ఎస్‌ఎస్‌బీలో కరోనా బారిన పడినవారి సంఖ్య 13కి పెరిగింది. ఇది ఇలా ఉండగా  భారత దేశంలో గడిచిన   24గంటల్లో 2573 కొత్త కేసులు,  83 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది .